- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సాధికారతకు జగనన్నే బ్రాండ్ అంబాసిడర్: మాజీ మంత్రి రోజా
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా మహిళా సాధికారతను ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆమె కొనియాడారు. ...

దిశ, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)కు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి రోజా(Former minister Roja) స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా మహిళా సాధికారతను ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) అని ఆమె కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత సైతం జగన్‌కే దక్కుతుందని రోజా వ్యాఖ్యానించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా సుమారు రూ. 2.74 లక్షల కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లోకే జమ చేయడం ఒక రికార్డు అని రోజా అభివర్ణించారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలు ఎదిగేలా జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శమని చెప్పారు. మహిళా బిల్లు విషయంలోనూ అదే చిత్తశుద్ధితో తమ మద్దతు ఉంటుందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.






