ఆ 11 కోట్లు మా వాళ్లవి కావు.. అంటగడుతున్నారు: పేర్ని నాని

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసులో సిట్ అధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు...

ఆ 11 కోట్లు మా వాళ్లవి కావు.. అంటగడుతున్నారు: పేర్ని నాని
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో సిట్ గుర్తించిన రూ. 11 కోట్లు వైసీపీ(Ycp)వి కాదని, అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) అన్నారు. లిక్కర్ కేసు నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్‌లో సిట్ అధికారులు రూ. 11 కోట్లు గుర్తించారు. దీంతో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో కట్టుకథలు అల్లి.. వాటికి మసాలాలు అద్దుతున్నారని కొట్టిపారేశారు. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేక వైసీపీని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ నగదు దొరికినా అది లిక్కర్ కేసుకు అంటగడుతున్నారని వ్యాఖ్యానించారు. డబ్బు దొరికిన ఫామ్ హౌస్‌ వాళ్లకు చాలా వ్యాపారులున్నాయని టీడీపీ నేతలే చెబుతున్నారని, అలాంటప్పుడు వైసీపీకి ఎలా అంటగడతారని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కోర్టులో వాదనలు జరుగుతున్నాయని, బెయిల్ వచ్చే సమయంలో ఇలాంటి నిందలు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ఇప్పటివరకూ పిట్టకథలే చెప్పిందని, ఇప్పుడు మాత్రం కొత్తేముందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Next Story