- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిపై పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు
అమరావతి రాష్ట్రానికి గుదిబండలా మారుతుందని మాజీ మంత్రి పేర్ని నాని జోస్యం చెప్పారు. రాజధాని అంటే సిరిసంపదలు ఇచ్చేలా ఉండాలని, కానీ అమరావతిని చంద్రబాబు అప్పులు పాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు...

దిశ, వెబ్ డెస్క్: అమరావతి రాష్ట్రానికి గుదిబండలా మారుతుందని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) జోస్యం చెప్పారు. రాజధాని(Capital) అంటే సిరిసంపదలు ఇచ్చేలా ఉండాలని, కానీ అమరావతి(Amaravati)ని చంద్రబాబు(Chandrababu) అప్పులు పాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీ రామారావు(Nt Ramarao) ఎప్పుడో చెప్పారని విమర్శించారు. నమ్మినవారిని చాలా మందిని చంద్రబాబు మోసం చేశారని పేర్ని నాని ఆరోపించారు. 2019కి ముందు ప్రధాని మోడీ కూడా చంద్రబాబు యూటర్న్‌లపై మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబు మోసాల బయోస్కోప్ తెలుగుదేశం పార్టీ నేతలు వేస్తారా అని ప్రశ్నించారు. 2015లో సీఆర్డీఏ అమరావతికి మాత్రమే మాస్టర్ ప్లాన్ చేశారని, కానీ ఇతర నగరాలకు ఎందుకు వేయలేదని పేర్ని నాని నిలదీశారు.
మావిగన్ ప్రతిపాదనతో కొత్త ప్లాన్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదించడంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని పేర్నినాని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఆర్వీఆర్ అసోసియేట్స్‌తో కొత్త మాస్టర్ ప్లాన్ చేయించారని ఆయన తెలిపారు. గుడివాడ, చల్లపల్లి సైతం రాజధానిలో ఉంటే అక్కడ ఏమి కడుతున్నారో చెప్పాలన్నారు. ఆ రెండు ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేశారా లేదా అని నిలదీశారు. అమరావతిలో రూ. 51 వేల కోట్లతో భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారని, మరి ఇతర ప్రాంతాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. 2028కి బేసిక్ రాజధాని పూర్తి చేస్తామని అంటున్నారని, మరి ఆ ఒక్క ప్రాంతానికే రూ. 51 వేల కోట్లు ఖర్చు చేస్తే అమరావతి పూర్తి కావడానికి ఎంత ఖర్చు అవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు.






