- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రప్పా.. రప్పా వ్యాఖ్యలు.. పేర్ని నానికి ఎదురుదెబ్బ
మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: రప్పా... రప్పా అంటూ సినిమా డైలాగులు చెప్పిన మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)కి ఎదురుదెబ్బ తగిలింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కృష్ణా జిల్లా పామర్రు(Pamarru) పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. తన పట్ల పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పటిషన్ దాఖలు చేశారు. అయితే పేర్ని నాని చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్‌పై విచారణను జులై 22వ తేదీకి వాయిదా వేసింది.
కాగా ఈ నెల 8న పామర్రులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ(Tdp) కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతూ రప్పా.. రప్పా అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్నినానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పేర్నినానితో పాటు సమావేశానికి అనుమతించి కల్యాణ్ మండపం ఓనర్ పై కేసు నమోదు అయింది. ఈ కేసులో పేర్ని నాని చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.






