- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నాపై కుట్ర చేస్తున్నారు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కోణంలోనే విచారణ జరుగుతోంది. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. అధారాలు లేకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫైల్స్ దగ్ధం వెనుక తన పాత్ర ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులతో తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఎన్నికల తర్వాత టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తలను చంపేశారు. బాలికపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఎన్నికలు నెరవేర్చలేకనే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.