- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లకు తప్ప.. జగన్ ఎవరికీ లొంగరు: పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
ప్రజలకు తప్ప జగన్ ఎవరికీ లొంగరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రజలకు తప్ప వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) ఎవరికీ లొంగరని మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) అన్నారు. వైసీపీ(Ycp)కి ప్రతిపక్ష హోదా అడుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి ఎందుకు భయమని ప్రశ్నించారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదాకోసం న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేస్తే చేయండని పేర్ని నాని హెచ్చరించారు.
అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ తాము కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు. దీంతో హోదా విషయంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Next Story






