రూ.15 వేలతో ఏ పండగ చేసుకోవాలి: చంద్రబాబుకు పేర్ని నాని సూటి ప్రశ్న

by Vemula.Srinu Prasad |

ఆటో డ్రైవర్ల సేవ పథకంపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు...

రూ.15 వేలతో ఏ పండగ చేసుకోవాలి: చంద్రబాబుకు పేర్ని నాని సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్: ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని(Auto Drivers) ఏపీ సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15 వేలు తమ ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ పండగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) స్పందించారు. రూ. 15 వేలతో ఏ పండగ చేసుకోవాలో చెప్పాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌-6 హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ఆరోపించారు. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. ఎన్నికలప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారని, ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలిచ్చారని, ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. ఆటో డ్రైవర్‌ సేవ స్కీమ్‌ ప్రారంభోత్సవంలో పండగ చేసుకోండి అని చంద్రబాబు అన్నారని, రూ.15 వేలతో ఏ పండగ చేసుకోవాలని పేర్ని నాని ప్రశ్నించారు.

Next Story