- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.25 కోట్లు ఇస్తే అనగాని వైసీపీలోకి వచ్చేవారు: పేర్ని నాని
మంత్రి అనగాని సత్య ప్రసాద్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Satya Prasad)పై మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy)పై మంత్రి అనగాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. విజయవాడ(Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ అనగాని సత్య ప్రసాద్ మంత్రిగా ఉండటం తమ ఖర్మ అని విమర్శించారు. మంత్రి హోదాలో యోగ్యుడిగా అనగాని ప్రవర్తించాలన్నారు. మంత్రి అనగాని సంస్కారం మరిచి మాట్లాడుతున్నారన్నారు. జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు.
ఒంట్లో రుగ్మత ఉంటే..
‘‘ఒంట్లో రుగ్మత ఉంటే ఇంట్లో డాక్టర్లు సరిపోయే అవకాశం ఉంటుంది. ఒంట్లో కాకుండా మొదడులోనూ, భావజాలంలోనూ సంస్కారంలోనో ఉన్మత్తత ఉంటే తగ్గించుకునేదానికి ప్రత్యేకమైన ఆస్పత్రులు ఉంటాయి. మనమధ్యే ఉంటూ మన మీదెక్కి ఏలుతున్న ఇలాంటి ఉన్మత్తులకున్న రుగ్మతలను త్వరగా తగ్గించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. రూ. 25 కోట్లు ఇస్తే అనగాని సత్యప్రసాద్ తమ పార్టీలోకి వచ్చేస్తానని అప్పుట్లో చెప్పారు. ఇందుకు జగన్ ఒప్పుకోలేదు. ఒప్పుకుని ఉంటే ఈరోజు నా పక్కన ఉండేవారు. అదృష్టం బాగుండి అనగాని మంత్రి అయ్యారు.’’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.






