తణుకు ఘటన.. జనసేన కార్యకర్తలపై మాజీ మంత్రి ఫైర్

by Vemula.Srinu Prasad |

జనసేన కార్యకర్తలపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....

తణుకు ఘటన.. జనసేన కార్యకర్తలపై మాజీ మంత్రి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన(Janasena) కార్యకర్తలపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Former Minister Karumuri Nageswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమా విడుదల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అభిమానులు బీభత్సం సృష్టించారు. కారుమూరి కాన్వాయ్ వాహనంపైకి ఎక్కి దాడి చేసి ధ్వంసం చేశారు. వాహనంపై ఉన్న వైఎస్ జగన్ ఫొటోలపై నిలబడి పవన్ కల్యాణ్ జెండాలు ఊపుతూ వీరంగం సృష్టించారు. దీంతో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఇవాళ తణుకులో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. మాజీ మంత్రి అయిన తనకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు తన కారును అడ్డుకున్నారని మండిపడ్డారు. కారుపై ఉన్న జగన్ చిత్రాన్ని అవమానించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన వారు చేసిన బీభత్సంతో ప్రజలు ఇబ్బందిపడ్డారని చెప్పారు. జనసేన కార్యకర్తల వైఖరి సరికాదని, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కారుమూరి డిమాండ్ చేశారు.

Next Story