- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి కాకాణికి రిమాండ్.. నెల్లూరు జిల్లా జైలుకు తరలింపు
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కోర్టు (Venkatagiri Court) రిమాండ్ విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కోర్టు (Venkatagiri Court) రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసు (illegal Mining Case)లో అరెస్టైన ఆయన్ను పోలీసులు కోర్టు హాజరు పరచగా.. 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలు (Nellore District Jail)కు తరలించారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలించగా.. బెంగళూరు సమీపంలో ఒక పల్లెటూరిలోఉన్న రిసార్టులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆదివారం (మే 25) సాయంత్రం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు.
పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందని మైనింగ్ శాఖ ఇన్ చార్జ్ డీడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇందులో మాజీ మంత్రి కాకాణి అనుచరుల ప్రమేయం ఉండగా.. వారికి ఆయన సహకరించారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి ఏ4 నిందితుడిగా ఉన్నారు.






