అవన్నీ అక్రమ కేసులే: మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-21 11:51:03  IST  )

తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు...

అవన్నీ అక్రమ కేసులే: మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) అన్నారు. అక్రమంగా మైనింగ్ తవ్విన కేసులో ఆయన 80 రోజులకు పైగానే జైలు జీవితం గడిపి విషయం తెలిసిందే. అయితే ఇటీవల బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. అంతేకాదు ఆయనపై ఇంకా మరికొన్ని కేసులు సైతం ఉన్నాయి. తాజాగా ఈ కేసులపై ఆయన స్పందించారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ జరగలేదని తెలిపారు. అయినా తనపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

Next Story