మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-05 13:59:42  IST  )

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది...

మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)కి బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీ(Police Custody)కి ఇస్తూ నెల్లూరు అట్రాసిటీ కోర్టు అనుమతించింది. అయితే కాకాణిని లాయర్ల సమక్షంలో విచారించాలని ఆదేశించింది. మళ్లీ ఆదివారం సాయంత్రం కాకాణిని తమ ఎదుట హాజరుపర్చాలని కోర్టు సూచించింది.

కాగా కాకాణి మంత్రిగా పని చేసిన సమయంలో నెల్లూరు జిల్లా(Nellore District)లో క్వార్జ్ అక్రమ మైనింగ్(Quartz Illegal Mining) జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనను విచారించేందుకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరుకాలేదు. దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో గాలించి చివరకు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఆయన తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. తనపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ నెల 9కు కేసును వాయిదా వేసింది. అయితే ఈ సాయంత్రం పోలీసుల కస్టడీ పిటిషన్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసింది. కాకాణిని మరింత లోతుగా విచారణ చేయాలని కోర్టును పోలీసులు అభ్యర్థించారు. దీంతో ఆయన్ను కస్టడీకి ఇస్తూ అనుమతించింది.

Next Story