Delhi: కాకాణికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-16 08:30:46  IST  )

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది...

Delhi: కాకాణికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లా(Nellore District)లో జరిగిన అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అ

యితే కాకాణి పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేసు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరపున లాయర్లు బతిమిలాడినా ధర్మసనం కరుణించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మరోవైపు ఏపీ హైకోర్టులోనూ ఆయన ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో కాకాణి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కేసు నమోదు, నోటీసులు జారీ చేసి రెండు నెలలు అవుతున్నా కాకాణి మాత్రం పరారీలోనే ఉన్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు కాకాణి హాజరవుతారేమో చూడాలి.

Next Story