ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి ఫిర్యాదు.. దేవుడి భూమిని ఆక్రమించారని ఆరోపణ

by Vemula.Srinu Prasad |

దేవుడి భూమిని ఆక్రమించారని ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి ఫిర్యాదు చేశారు..

ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి ఫిర్యాదు.. దేవుడి భూమిని ఆక్రమించారని ఆరోపణ
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిగా సాగుతోంది. ఇద్దరి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం ఇప్పుడు మరింత పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మాటల నుంచి ఫిర్యాదుల వరకు చేరింది. గత ప్రభుత్వం చేసిన దోపిడీలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటి వరకూ విమర్శలు కురిపించారు.

అయితే కాకాణి గోవర్ధన్ మాత్రం ఏకంగా ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా సోమిరెడ్డిపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాకుటూరులో దేవుడి భూమిని ఆక్రమించారంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఆలయ భూములు ఆక్రమణలను గురవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని కోరారు. లేనిపక్షంలో తాము న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనుల్లోనూ టీడీపీ నాయకులు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తామని కాకాణి తెలిపారు.

Next Story