- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG BREAKING: కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్?
ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేష్ ను సిట్, ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయనున్నట్లు..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఆదివారం ఉదయం సిట్, ఎక్సైజ్ అధికారులు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా పోలీసుల విచారణలో నిర్థారణ అయినట్లు సమాచారం. ఈ కేసులో అరెస్టైన ఏ1 నిందితుడు జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిట్, ఎక్సైజ్ అధికారులు ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకుని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటిలో జోగిరమేష్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సిట్, ఎక్సైజ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఇబ్రహీంపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లుగా జనార్థన్ రావు సిట్ విచారణలో తెలిపాడు. ఆయన చెప్తేనే తాను మద్యం తయారు చేశానని సంచలన విషయాలు వెల్లడించాడు. తనకు జోగి రమేష్ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఆయన సూచనలతోనే విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానన్నాడు. కానీ.. జనార్థన్ రావు చెప్పిన విషయాలను జోగి రమేష్ ఖండించారు. అసలు అతనెవరో కూడా తనకు తెలియదన్నారు. నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో తనను కావాలని ఇరికిస్తున్నారని, ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ.. శనివారం హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ వేశారు.






