ఏం చేసినా ఇలానే ఉంటా: జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. ..

ఏం చేసినా ఇలానే ఉంటా: జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటానని మాజీ మంత్రి జోగి రమేశ్(Former Cm Jogi Ramesh) అన్నారు. ఇబ్రహీంపట్నం, ములకలచెరువు నకిలీ మద్యం(Fake alcohol) వ్యవహారంలో ఆయన పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో జోగి రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందు వల్లే తనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు బాధ్యత ఉందని, అందువల్లే ప్రశ్నిస్తున్నానన్నారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీని తానే బాహ్య ప్రపంచానికి చూపించానని తెలిపారు. అసలు ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. నకిలీ మద్యం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని దేవుడిపైనా ప్రమాణం చేశానని, ఇప్పటికిప్పుడు ఎలాంటి టెస్టులకైనా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. రిమాండ్‌లో ఉన్న జనార్ధన్ రావు ఆడియో ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బాధ్యత ఉంటే చట్టాన్ని, వ్యవస్థలను తన చేతుల్లోకి తీసుకోకూడదని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.

Next Story