- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలు నుంచి విడుదలైన జోగి రమేశ్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ జైలు నుంచి విడుదలయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: సాధారణ ఖైదీగా తనను జైలులో ఇబ్బందులు పెట్టారని మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) ఆరోపించారు. నకిలీ లిక్కర్ కేసు(Fake liquor case)లో ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో విజయవాడ జైలు(Vijayawada Jail) నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ తనను 83 రోజులు పాటు అక్రమంగా జైలులో ఉంచారని వ్యాఖ్యానించారు. నకిలీ లిక్కర్ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఓ ఫేక్ ముఖ్యమంత్రి అని జోగి రమేశ్ విమర్శించారు. తనను అరెస్ట్ చేయించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రాక్షసానందం పొందారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎక్కడ ప్రమాణం చేయిమన్నా చేస్తానని సవాల్ విసిరానని గుర్తు చేశారు. అక్రమం కేసులకు తాము భయపడమని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. ‘‘చివరికి నా భార్య మీద కూడా కేసు పెట్టారు. కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. చంద్రబాబు పదవి శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండే అధికారులు ఎందుకు తొత్తులుగా మారుతున్నారు?. ఎవరినీ వదిలిపెట్టను.’’ అని జోగి రమేశ్ హెచ్చరించారు.
రెండు కేసుల్లోనూ బెయిల్
కాగా ములకపల్లి, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేస్తూ కొందరు దుండగులు పోలీసులకు దొరికారు. దీంతో కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో జోగి బ్రదర్స్ ను అరెస్ట్ చేసి విజయవాడ జైలుకు తరలించారు. 83 రోజుల పాటు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురైంది. తాజాగా జోగి రమేశ్ తో పాటు ఆయన సోదరుడు రాముకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇద్దరూ కూడా జైలు నుంచి విడుదలయ్యారు.






