- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తులసి నీళ్లు పోసినట్టుంది.. ఆటోడ్రైవర్ల పథకంపై జోగి రమేష్ విమర్శలు
ఆటోడ్రైవర్ల సేవ పథకంపై మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శలు కురిపించారు...

దిశ, వెబ్ డెస్క్: ఆటోడ్రైవర్ల(Auto Drivers) సేవ పథకంపై మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) విమర్శలు కురిపించారు. చావుబతుకుల్లో ఉన్నవారికి తులసి నీళ్లు పోసినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ వాహన మిత్ర పథకాన్ని కాపీ కొట్టారని సెటైర్లు వేశారు. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లపై కేసులు పెట్టలేదని తెలిపారు. 3 లక్షల మంది ఆటోడ్రైవర్ల కడుపుకొట్టారన్నారు. 50 వేల మంది ఉన్న ఆర్టీసీని దెబ్బతీశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
కాగా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఈ రోజు రూ. 15 వేల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆటో డ్రైవర్లు మాదిరిగా చొక్కాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులు అకౌంట్‌లో రూ.15 వేలు వేస్తూ పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఈ పథకంపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.






