జోగి రమేశ్‌కు భారీ ఊరట.. కల్తీ మద్యం కేసులో బెయిల్ మంజూరు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-23 11:03:47  IST  )

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ సోదరులకు బెయిల్ మంజూరు అయింది..

జోగి రమేశ్‌కు భారీ ఊరట.. కల్తీ మద్యం కేసులో బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) కు భారీ ఊరట లభించింది. కల్తీ మద్యం కేసు(Fake Liquor Case)లో నిందితులుగా ఉన్న ఆయనతో పాటు సోదరుడు రాముకు విజయవాడ కోర్టు(Vijaywadad Court)లో బెయిల్ మంజూరు చేసింది. కాగా జోగి రమేశ్ సోదరులపై కల్తీ మద్యం కేసు విజయవాడ భవనీపురం పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే జోగి రమేశ్ తో పాటు ఆయన సోదరుడు రామును అరెస్ట్ చేసి విజయవాడ జైలుకు తరలించారు. దీంతో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును పలుమార్లు అభ్యర్థించారు. అయితే నిరాకరించిన కోర్టు తాజా వాదనలతో ఏకీభవించింది. ఈ మేరకు జోగి రమేశ్, రాముకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సాయంత్రం వరకూ జోగి రమేశ్ సోదరులు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. చూడాలి.

Next Story