పోలీస్ స్టేషన్‌కు జోగి రమేశ్.. మామిళ్లపల్లిలో ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొక్క జొన్న రైతులను పరామర్శించేందుకు మామిళ్లపల్లికి వెళ్లేందుకు మాజీ మంత్రి జోగి రమేశ్ యత్నించారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ...

పోలీస్ స్టేషన్‌కు జోగి రమేశ్.. మామిళ్లపల్లిలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొక్క జొన్న రైతులను పరామర్శించేందుకు మామిళ్లపల్లికి వెళ్లేందుకు మాజీ మంత్రి జోగి రమేశ్ యత్నించారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, జోగి రమేశ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్థానికంగా అరుపులు, కేకలతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొక్క జొన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జోగి రమేశ్ మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గోడౌన్‌లో నిల్వ ఉంచిన మొక్క జొన్న సీజ్

కాగా మామిళ్లపల్లిలో ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన మొక్క జొన్నను అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ గోడౌన్ వైసీపీ నేతకు చెందినది కావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. స్థానిక వైసీపీ నేత అంబటి మురళి వర్సెస్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రగా మారింది. రెండు వర్గాల శ్రేణుల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మామిళ్లపల్లికి వెళ్లేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అదుపు చేస్తున్నారు. మామిళ్లపల్లికి వెళ్లేందుకు యత్నించిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ను సైతం పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం జోగి రమేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

Next Story