మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం ధ్వంసం.. తీవ్ర ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-21 14:06:17  IST  )

అనకాపల్లి జిల్లా తగరంపూడిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంపై కాపు సామాజికవర్గ నాయకులు, గురునాథరావు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు...

మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం ధ్వంసం.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli ) తగరంపూడిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంపై కాపు సామాజికవర్గ నాయకులు, గురునాథరావు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన నేత విగ్రహాన్ని అవమానించడం సహించరానిదని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

విచారణ ముమ్మరం


మరో వైపు ఈ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విగ్రహం ధ్వంసమైన తీరును పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షలా, ఆకతాయిల పనా అనే కోణంలో విచారిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగరంపూడిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధ్యులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story