మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు..

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన్ను అమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు. సూర్యారావుకు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. కార్యకర్తల సమావేశంలో ఉండగానే సూర్యారావు కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణను వ్యతిరేకిస్తున్న వైసీపీ.. ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 6న (రేపు) శివకోటి గ్రామంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో సూర్యారావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story