AP Budget : ఏపీ బడ్జెట్ పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రియాక్షన్

by Y. Venkata Narasimha Reddy |

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ అత్మస్తుతి పర నిందలా ఉందని వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు

AP Budget : ఏపీ బడ్జెట్ పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ అత్మస్తుతి పర నిందలా ఉందని వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వాన్ని దూషించడం.. సీఎం చంద్రబాబు, లోకేష్ ను పొగడటంతోనే బడ్జెట్ ప్రసంగం సరిపోయిందన్నారు. నేను మూడు సందర్భాలు మంత్రిగా పనిచేసిన కాలంలో ఇంతటి స్వీయా భజనలు చేసుకోవడం చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో వారి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు.

కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ద్వజమెత్తారు. బడ్జెట్ ద్వారా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బొత్స విమర్శించారు. మహిళలకు ఆర్థిక సహాయం, రైతు భరోసాలకు కేటాయింపులు చూస్తే అరకొరగా ఉన్నాయన్నారు. అమ్మకు వందనం పథకానికి కూడా కేటాయింపులు సక్రమంగా లేవన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఊసే లేదన్నారు. నిరుద్యోగ భృతి విస్మరించారని విమర్శించారు. గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారని, ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించిందని.. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింద బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదని..మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15 వేలు, రైతుకు 20 వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయని పేర్కొన్నారు. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలని..కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారన్నారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు. ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదన్నారు. 50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చామని బొత్స చెప్పుకొచ్చారు.

అన్నదాత సుఖీభవ ఇస్తే రూ.12 వేల కోట్లు కావాలన్నారు. మిర్చి రైతుల సమస్య సై పోరాటం చేస్తే జగనపై కేసు పెట్టారు. ఒక్కో కిలో, ఒక్క క్వింటా. ఒక్క బస్తా అయినా కొన్నారా?. ఎంత సేపు" పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.

Next Story