Free Bus: చంద్రబాబు ఫ్రీ బస్ పథకంపై ప్రశ్నల వర్షం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-19 12:15:30  IST  )

రాష్ట్రంలో అమలుకానున్న ఫ్రీ బస్సు పథకంపై మాజీ మంత్రి, బొత్స సత్యనారాయణ విమర్శలు కురిపించారు..

Free Bus: చంద్రబాబు ఫ్రీ బస్ పథకంపై ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని(Free Bus Scheme) అమలు చేస్తామని, ముహూర్తం కూడా ఖరారు అయిందని రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం అమలుకు ముహూర్తం ఏంటని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) ప్రశ్నించారు. విశాఖ(Visakha)లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఆయన ప్రశ్నలు సంధించారు.

బొత్స సంధించిన ప్రశ్నలు ఇవే..!


‘మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడానికి ముహూర్తం ఏంటి..?. ఉచిత బస్సు ప్రయాణం అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు p4కి సంబంధం ఏమిటి?. p4కి పథకాలకు లింక్ పెట్టడం ఏమిటి..?. లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ’ అని. కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు(Chandrababu) ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు నష్టపోతారన్నారు. ఎన్నికల కొన్ని రోజులు ముందు హామీలు ఇవ్వడం మాట తప్పడం చంద్రబాబుకు అలవాటేనని బొత్స ఎద్దేవా చేశారు.

Next Story