Tirumala Issu: వైఎస్ జగన్‌పై జయరాం హాట్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-09 08:59:33  IST  )

తిరుమల లడ్డూ వ్యవహారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు...

Tirumala Issu: వైఎస్ జగన్‌పై జయరాం హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారం(Tirumala laddu affair)పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(MLA Gummanur Jayaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను మంత్రిగా కళ్లకు బట్టలు కట్టుకుని ధృతరాష్ట్ర పాత్ర పోషించనని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంలో లడ్డూ కల్తీ జరిగిందని జయరాం స్పష్టం చేశారు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో రుచి లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు. శ్రీవారికి అన్యాయం చేయడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని జయరాం ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో కళ్లు మూసుకుని పని చేశామని చెప్పారు. దేవుడికి అన్యాయం చేస్తే సర్వనాశనమేనని జయరాం హెచ్చరించారు. కాగా తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న రివర్స్ ఆరోపణలపై జయరాం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Next Story