- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా: ఎమ్మెల్సీ బొత్స
మాజీ మంత్రి అంబటి రాంబాబు అంశాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రస్తావించారు...

దిశ, వెబ్ డెస్క్: ‘అంబటి రాంబాబు(Ambati Rambabu) తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా.’’ అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పెట్టిన కేసులపై శాసనమండలిలో ఆయన ప్రస్తావించారు. అంబటి రాంబాబుపై దాడి చేయడం వల్లే ఆయన ఘాటుగా మాట్లాడారని బొత్స వ్యాఖ్యానించారు. ఆ తరువాత పశ్చాత్తాపం వ్యక్తం చేశారని, విజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. అంబటిని వేధించిన ప్రతి ఒక్కరూ భవిష్యత్ కాలంలో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని బొత్స హెచ్చరించారు.
దాడులు తప్పు కాదా?
ప్రజా స్వామ్యంలో ప్రజా ప్రతినిధులపై దాడులు చేయడం తప్పు కాదా? అని బొత్స ప్రశ్నించారు. ‘‘మరోమాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపైనా పెట్రోల్ బాంబులు వేశారని, రాజకీయాల్లో మహిళలను తీసుకు వచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘అంబటి రాంబాబు తల్లి తల్లి కాదా...?. తల్లి ఎవరికైనా తల్లే. అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా?. మహిళ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. అంబటి రాంబాబు తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పారు. అంబటి రాంబాబు తల్లిని దూషించిన వీడియోలు ఉన్నాయి.






