- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ జైలుకు అంబటి.. 14 రోజుల రిమాండ్
మళ్లీ జైలుకు మాజీ మంత్రి అంబటి రాంబాబును తరలించారు....

దిశ, వెబ్ డెస్క్: మళ్లీ జైలుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minsiter Ambati Rambabu)ను తరలించారు. సంక్రాంతి సంబరాల కేసు(Sankranthi Celebrations Case)లో ఆయనకు గుంటూరు సివిల్ జడ్జి(Guntur Civil Judge) 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు జైలుకు తరలించారు. 2023లో సంక్రాంతి సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. అయితే ఈ లక్కీ డ్రా పేరుతో అక్రమాలకు పాల్పడి భారీగా డబ్బులు దండుకున్నారని జనసేన పార్టీ జిల్లా ఇంచార్జి గాదె వెంకటేశ్వర్లు అంబటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. పీటీ వారెంట్ తీసుకుని జైలులో ఉన్న అంబటిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అంబటికి ధర్మాసనం రిమాండ్ విధించింది.
ఈ కేసుల్లోనూ రిమాండ్
కాగా అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదు అయ్యాయి. సీఎం చంద్రబాబును దూషించిన కేసుతో పాటు గుంటూరులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులోనూ ఆయనకు జడ్జి రిమాండ్ విధించారు. దీంతో రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. అయితే ఈ రెండు కేసుల్లోనూ అంబటికి బెయిల్ మంజూరు అయింది. ఇంతలో సంక్రాంతి సంబరాల కేసులో ఆయన రిమాండ్ పడింది. దీంతో రాజమండ్రి జైలుకు తరలించారు.






