- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌కు ఏ జ్వరం వచ్చిందో నాకు తెలియదు: అంబటి రాంబాబు సెటైర్లు
డిప్యూటీ సీఎం పవణ్ కల్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు..

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Kalyan) జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) శుక్రవారం గుంటూరు(Guntur)లో మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ జ్వరంపై సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్‌కు ఏ జ్వరం వచ్చిందో తనకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు సీఎం చంద్రబాబు నాయుడిపైనా విమర్శలు కురిపించారు. చంద్రబాబు దగ్గర రెడ్‌బుక్ ఉన్నంత వరకు వైసీపీ నాయకులపై కేసులు పెడుతూనే ఉంటారని చెప్పారు. 8 నెలల కూటమి ప్రభుత్వంలో ఒక్క హామీ కూడా నెరవేరలేదని అంబటి విమర్శించారు.
అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అసత్యాలు చెప్పారని అంబటి ఆరోపించారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. హామీలు అమలు చేయడంలో చంద్రబాబుకు ఉన్న 40 ఏళ్ల అనుభవం ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం బాగా తగ్గిపోయిందని ఆరోపించారు. కూటమి పాలనలో అన్ని మోసాలు, దాడులు, అరాచకాలేనని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త నగరాలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చన్నారు. మూడు రాజధానులపై తమ స్టాండ్ ఏంటో త్వరలో చెప్తామని అంబటి రాంబాబు తెలిపారు.






