- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వల్లభనేని వంశీ అరెస్ట్.. పోలీసులపై అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
ప్రభుత్వంతో కుమ్మక్కై వంశీని పోలీసులు అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు..

దివ, వెబ్ డెస్క్: గన్నవరం టీడీపీ కార్యాలయం(Gannavaram Tdp Office)పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Mla Vallabhaneni Vamsi)ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్‌ను మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఖండించారు. ఇది అక్రమ కేసు అని ఆరోపించారు. తన బృందం కలిసి డీజీపీ కార్యాయంలో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘2022లో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయనే మేజిస్ట్రేట్ ముందు అది పోలీసులు బలవంతంగా ఇప్పించిన ఫిర్యాదు అని చెప్పారు. సాక్షి సంతకం పెట్టమని పిలిచి, పోలీసులు రాసుకున్న కంప్లైంట్‌పై తనతో సంతకం పెట్టించుకున్నారని జడ్జిముందు తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం దొంగ కేసు పెట్టించిన విషయం బయటకు రావడంతో మళ్లీ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను బెదిరించి వంశీపై ఓ తప్పుడు కేసు పెట్టించారు. వల్లభనేని వంశీపై చంద్రబాబు, లోకేష్ కక్షపెట్టుకుని దాడులు చేయించారు. ఇప్పుడు తప్పుడు కేసు బనాయిస్తున్నారు. పోలీసులు, టీడీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారు. పోలీసులు వంశీతో ఆయన భార్యను, వారి లాయర్‌ను కూడా కలవనీయలేదు. దీనిపై డీజీపీకి కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు అందుబాటులో లేరు.’’ అని అంబటి రాంబాబు తెలిపారు.






