- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీమరాజా, కిర్రాక్ ఆర్పీకి బిగ్ షాక్.. పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు
సీమరాజా, కిర్రాక్ ఆర్పీకి మాజీ మంత్రి అంబటి రాంబాబు బిగ్ షాక్ ఇచ్చారు..

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా కార్యకర్త సీమరాజా(Social media activist Seemaraja), జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ(Jabardast actor Kirrak RP)పై గుంటూరు పట్టాభిపురం(Guntur Pattabhipuram) పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి రోజా(Former minister Roja)తో పాటు తనను, వైఎస్ జగన్(Ys Jagan)ను, తమ పార్టీ నేతలను కించపర్చేలా పోస్టులు, తప్పుడు వ్యాఖ్యలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ పోలీసులు స్పందించడంలేదని అంబటి ఆరోపించారు. అందుకే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నామని అంబటి తెలిపారు.
సోషల్ మీడియాలో తమపై అసత్యప్రచారాలు చేస్తున్న వారిని వదలమని మాజీ మంత్రి అంబటి హెచ్చరించారు. సీమరాజా, కిర్రాక్ ఆర్పీని చట్టం వదలిపెట్టదని, శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఐటీడీపీపైనా పోలీసులకు ఫిర్యాదు చేశామని అంబటి స్పష్టం చేశారు. టీడీపీ(Tdp) నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు.. తాము ఫిర్యాదు చేస్తే మాత్రం తీసుకోవడంలేదని ఆరోపించారు. కానీ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేవరకు తమ పోరాటం ఆగదన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు (Supreme Court)కు కూడా వెళ్తామని మాజీ మంత్రి అంబటి పేర్కొన్నారు.






