- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు శ్రీలంక అన్నారు.. ఇప్పుడు సింగపూర్ అవుతుందా: అంబటి
అప్పుడు శ్రీలంక అన్నారని, ఇప్పుడు సింగపూర్ అవుతుందా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాభివృద్ధికి వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వం అప్పులు చేసిన నేపథ్యంలో ఏపీ మరో శ్రీలంక(Srilanka) కాబోతోందనిట టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ప్రస్తుతం కూటమి సైతం అప్పులు చేస్తోంది. దీంతో టీడీపీ(Tdp) నేతలు గతంలో చేసిన విమర్శలను గుర్తు చేస్తు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నేతలు సెటైర్లు వేస్తున్నారు. మరి ఇప్పుడేమంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సైతం టీడీపీ నేతలపై విమర్శలు కురిపించారు.
వాళ్ల పర్మినెంట్ నివాసం ఎక్కడుంది..?
గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారని, చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్ అవుతుందా.? అని ఎద్దేవా చేశారు. తమ హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో రూ.3.02 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. జగన్ కుట్రలు చేయటానికి బెంగళూరులో ఉండాల్సిన అవసరం ఏముందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పర్మినెంట్ నివాసం ఎక్కడుంది? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.






