- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందులలో గందరగోళం: అంబటి ఘాటు వ్యాఖ్యలు
కడప జిల్లా పులివెందుల పోలీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక(Pulivendula ZPTC by-election) పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది హైటెన్షన్ మరింత పెరుగుతోంది. టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నేతలు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రెండు పార్టీ నేతలు దాడులు చేసుకుంటారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలపై నమోదు చేసిన కేసుల విషయంలో ఆ పార్టీ విమర్శలు చేస్తున్నారు. తమ వాళ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఎన్ని అన్యాయాలు, అక్రమాలు చేసైనా సరే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) స్పందించారు. గుంటూరు వైసీపీ(Ycp) కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల(Pulivenduala)లో తమ నేతలను చంపేయాలని ప్రయత్నం చేశారు. పెట్రోల్ పోసి కారుతో సహా చంపేయాలని యత్నించారు. భయబ్రాంతులు, గందరగోళం సృష్టించైనా పులివెందులను కైవసం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.‘‘వైసీపీ వాళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు సినిమా చూసినట్లు చూస్తున్నారు. దాడిలో గాయపడిన వారిపై కేసులు పెడుతున్నారు. చావు బతుకుల మధ్య ఉన్న ఇద్దరు వైసీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. మమ్మల్ని టీడీపీ(Tdp) వాళ్లు కొట్టినా మాపైనే కేసులు పెడుతున్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమ నేతలపైనే డీఎస్పీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆయన డీఎస్పీనా.. పొలిటీషయన్‌నా. అంతకుముందుకన్నా ఇప్పుడు మెరుగైన శాంతి భద్రతలను మెయింటెనెన్స్ చేస్తున్నామని ఆయన చెప్పడం చాలా దారుణం. పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి ఖాకీలు ఎందుకు దిగజారిపోయారు.’’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.






