- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి కథ అంతులేనిదిలా మారింది: మాజీ మంత్రి అంబటి ఆందోళన
అమరావతి కథ అంతులేని కథలా మారిందనిమాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం మరోసారి భూసేకరణకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. అయితే మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu) మాత్రం ప్రభుత్వం నిర్ణయంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయని తెలిపారు. అమరావతి కథ అంతులేని కథలా మారిందని విమర్శించారు. అమరావతిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రైతులు ఇప్పటికే 35 వేల ఎకరాల భూములు ఇచ్చారని, మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాలతో అత్యుత్తమ రాజధాని కడతామని సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
Next Story






