- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోపిడీ కోసమే అమరావతి నిర్మాణం: మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప అమరావతిని నిర్మించాలన్న ఆలోచన కూటమి నాయకులకు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప అమరావతి(Amaravati)ని నిర్మించాలన్న ఆలోచన కూటమి వాళ్లకు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Cm Chandrababu Naidu) అన్నారు. అమరావతి నిర్మాణం పున:ప్రారంభంపై ఆయన స్పందించారు. అప్పు తెచ్చేది అమరావతి నిర్మాణం కోసం కాదని, కూటమి నేతలు దోచుకోవడానికి అప్పు తెస్తున్నారని అంబటి ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణానికి ఒక కిలోమీటర్‌కు రూ.20 కోట్లు అయితే రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా కాంట్రాక్టర్ల ద్వారా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి సంక్షేమ పథకాలు అమల్లో లేవని అంబటి వ్యాఖ్యానించారు.
‘‘అప్పు చేయడం వల్ల రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో పడబోతోంది. రాష్ట్రంలో రూపాయి అదాయం లేదు. రాబడులు, ఆదాయం ఉంటే అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తే సంతోషమే. కానీ అప్పు చేసి అమరావతినే అభివృద్ధి చేస్తే ఏం లాభం. మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి. అమరావతిని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేదని, అప్పు తెచ్చి దోచుకోవాలని చూస్తున్నారు. ’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.






