వైసీపీ నేతలపై కేసులు.. పోలీసులకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు, పోలీసులపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు...

వైసీపీ నేతలపై కేసులు.. పోలీసులకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) అధినేత వైఎస్ జగన్(Ys Jagan) నెల్లూరు(Nellore) పర్యటన మరింతగా రాజకీయ వేడిని పెంచింది. జనసమీకరణపై పోలీసుల ఆంక్షలను వైసీపీ నేతలు బేఖాతరు చేశారు. వేలాడి మంది కార్యకర్తలతో జగన్ పర్యటన కొనసాగింది. అంతేకాదు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని వైసీపీ నేతలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు నిబంధనలను ఉల్లంఘించడంపై ప్రజల నుంచి సైతం వ్యతిరేకత వస్తోంది. అనుమతి ఇచ్చిన దానికంటే వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా రావడంపై మరోవైపు పోలీసులు సీరియస్ అయ్యారు. వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేస్తున్నారు.

దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిలవకపోయినా ప్రజలు వస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు పోలీసులను ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. జగన్ టూర్లకు ప్రజలు రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో జగన్ ఆదరణ పెరుగుతోందని, కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని విమర్శించారు. చంద్రబాబు(Chandrababu) మోచేతి నీళ్లు తాగి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే వారందరి పని చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత చాలా మంది ఐఏఎస్, ఏపీఎస్ లపై కేసులు నమోదు అయ్యాయని అంబటి గుర్తు చేశారు.

Next Story