గోరంట్ల మాధవ్‌ను ఏం చేస్తారో అని భయంగా ఉంది: మాజీ మంత్రి అంబటి

by Vemula.Srinu Prasad |

గోరంట్ల మాధవ్‌ను ఏం చేస్తారో అని భయంగా ఉంది: మాజీ మంత్రి అంబటి
X

దిశ, వెడ్ డెస్క్: ఐటీడీపీ మాజీ నేత కిరణ్(Former ITDP leader Kiran) అరెస్ట్ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌(Former MP Gorantla Madhav)ను గుంటూరు నగరం‌పాలెం(Guntur Nagarapalem) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే గోరంట్లను అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) భయాందోళన వ్యక్తం చేశారు. గోరంట్లను స్టేషన్‌ వెనుక నుంచి తీసుకెళ్లారని తెలిపారు. నగరంపాలెం పీఎస్‌కు తమను అనుమతించలేదని, మాధవ్‌ను ఏం చేస్తారో అని భయంగా ఉందన్నారు. ఐటీడీపీ కార్యకర్త కిరణ్ దారుణంగా మాట్లాడాడని మండిపడ్డారు. కిరణ్‌ను అరెస్ట్‌ చేసి డ్రామా ఆడుతున్నారని అంబటి ఆరోపించారు.

Next Story