మాకు ఎస్సీలు మాత్రమే పూర్తిగా ఓటేశారు.. ఎన్నికలపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

2024 ఎన్నికల్లో వైసీపీకి ఎస్సీలు మాత్రమే పూర్తిగా ఓటేశారని మాజీ మంత్రి అమర్‌నాథ్ అన్నారు...

మాకు ఎస్సీలు మాత్రమే పూర్తిగా ఓటేశారు.. ఎన్నికలపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఎన్నికల్లో 70 శాతం మంది ఎస్సీలు తమకు ఓటు వేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత అమర్‌నాథ్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆయన 2024 ఎలక్షన్లలో ఓటమిపై స్పందించారు. పోలింగ్ సరళిని తాను విశ్లేషించానని, తమ పార్టీకి అగ్రవర్ణాలు సహకరించలేదని చెప్పారు. బీసీలు కేవలం 30 నుంచి 35 శాతమే ఓటేశారని తెలిపారు. కాపులు 20 శాతం, రెడ్లు 50 శాతం మంది మాత్రమే తమకు సహకారం అందించారన్నారు. 70 శాతం మంది ఎస్సీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని తెలిపారు. ఎస్సీలు మాత్రమే 2024 ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచారని అమర్‌నాథ్ పేర్కొన్నారు.

Next Story