నన్ను గుడ్డు మంత్రి అన్నారు.. ఇప్పుడు లోకేశ్‌ను అలా అనొచ్చా: అమర్‌నాథ్

by Vemula.Srinu Prasad |

మంత్రి లోకేశ్‌కు మాజీ మంత్రి అమర్ నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు..

నన్ను గుడ్డు మంత్రి అన్నారు.. ఇప్పుడు లోకేశ్‌ను అలా అనొచ్చా: అమర్‌నాథ్
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి అమర్‌నాథ్‌(Amarnath)ను గుడ్డు మంత్రి అంటూ టీడీపీ(Tdp) నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కామెంట్స్‌కు అమర్‌నాథ్ ఇప్పుడు సమాధానం చెప్పారు. తనను గుడ్డు మంత్రి అన్నప్పుడు లోకేశ్(Lokesh) వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన్ను అలా అనవచ్చా అని ప్రశ్నించారు. యువతకి ఉద్యోగాల గురించి అడిగితే శోభనం రోజే పిల్లలు పుట్టేస్తారా? అని లోకేశ్ వెటకారం చేస్తూ ట్వీట్ చేశారని మాజీ మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు. అనకాపల్లి(Anakapalli)లో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలపై విమర్శలు కురిపించారు. మరి తాను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ చెప్పింది ఇదే కదా? అని గుర్తు చేశారు. కోడి గుడ్డు పెడతాదిగానీ.. కోడిని పెట్టదు కదా అన్నానని, తనను గుడ్డు అమర్నాథ్ అంటూ పిలిచారని ఆయన గుర్తు చేశారు. మరి ఈరోజు నుంచి మనం శోభనం లోకేశ్ అని పిలవాలి కదా? అని నిలదీశారు. తాను గుడ్డు కథ చెప్తే తప్పు కానీ.. లోకేశ్ శోభనం కథ చెప్తే తప్పు కాదా? అని గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు.

Next Story