- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వల్లభనేని వంశీ కేసులో పోలీసులకు షాక్.. పిటిషన్ కొట్టివేత
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులకు ఊరట లభించింది...

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులకు ఊరట లభించింది. వ్యక్తి కిడ్నాప్, బెదిరింపుల కేసులో మరోసారి వీరిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో కృష్ణలంక పోలీసులు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ చేపట్టిన ధర్మాసనం.. వల్లభనేని వంశీ తరపు వాదనలతో ఏకీ భవించింది. వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు అరెస్ట్ అయ్యారని, ఓ సారి కస్టడీకి తీసుకుని విచారించారని ఆయన తరపు లాయర్లు కోర్టుకు వివరించారు. దీంతో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వ్యక్తి కిడ్నాప్, బెదిరింపుల కేసు విచారణను వాయిదా వేసింది.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు దిగిన కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులను విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. తమకు బెయిల్ ఇవ్వాలని వంశీతో పాటు ఆయన అనుచరులు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే వారిని పోలీసులు ఓ సారి కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. అయితే మరింత లోతుగా విచారణ జరిపేందుకు 10 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరిన నేపథ్యంలో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.






