మద్య నిషేదం చేయాలంటూ మాజీ ఎక్సైజ్‌శాఖ మంత్రి డిమాండ్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-01 06:33:32  IST  )

మ‌ద్యంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో మ‌ద్యాన్ని పూర్తిగా నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ హ‌యాంలో ఇంగ్లీష్ మీడియం త‌ర‌గ‌తులు ప్ర‌వేశ‌పెట్టి మంచి విద్య‌ను అందించారని అన్నారు.

మద్య నిషేదం చేయాలంటూ మాజీ ఎక్సైజ్‌శాఖ మంత్రి డిమాండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: మ‌ద్యంపై మాజీ ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయ‌ణ స్వామి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో మ‌ద్యాన్ని పూర్తిగా నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ హ‌యాంలో ఇంగ్లీష్ మీడియం త‌ర‌గ‌తులు ప్ర‌వేశ‌పెట్టి మంచి విద్య‌ను అందించారని అన్నారు. ఆ త‌ప‌న ఈ ప్ర‌భుత్వానికి కూడా రావాల‌ని దేవుడిని కోరుకున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో పూర్తిగా మ‌ద్యం నిషేదించాల‌ని తాను భ‌గ‌వంతుడిని కోరుకున్న‌ట్టు చెప్పారు. అయితే నిజానికి (2019–2024) మ‌ధ్య‌ నారాయ‌ణ‌స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా సైతం ప‌నిచేశారు.

వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంల‌నూ ఈయ‌న పేరు ఉంది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత మ‌ద్యం కుభ‌కోణంపై సిట్ ఏర్పాటు చేయ‌గా అధికారులు సుమారు 6గంట‌ల పాటు నారాయ‌ణ‌స్వామిని విచారించారు. అయితే ఎక్సైజ్ విధానం రూప‌క‌ల్ప‌న‌, నిర్ణ‌యాల గురించి త‌న‌కేమీ తెలియ‌ద‌ని, అప్ప‌ట్లో ఉన్న‌త స్థానాల్లో ఉన్న‌వారికే తెలుస‌ని విచార‌ణ‌లో ఎప్పారు. గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ప‌నిచేసి అప్పుడే మ‌ద్యాన్ని నిషేదించాల‌ని డిమాండ్ చేయ‌కుండా ఇప్పుడు నిషేదించాల‌ని డిమాండ్ చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Next Story