టీడీపీలోకి ఆళ్ల నాని.. చంద్రబాబు సమక్షంలో రేపు చేరిక

by Vemula.Srinu Prasad |

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో సోమవారం చేరనున్నారు

టీడీపీలోకి ఆళ్ల నాని.. చంద్రబాబు సమక్షంలో రేపు చేరిక
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(Former Deputy CM Alla Nani) టీడీపీ(Tdp)లో సోమవారం చేరనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) స‌మ‌క్షంలో ఆయ‌న సైకిల్ ఎక్కనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయ‌న ఇప్పటికే టీడీపీ స‌భ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా 2024 ఎన్నిక‌ల్లో ఆళ్ల నాని వైసీపీ(Ycp) నుంచి పోటీ చేసి ఓట‌మి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు, పార్టీకి ఆళ్ల నాని దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. టీడీపీ సభ్యత్వం తీసుకోవడంతో త్వరలో సైకిల్ ఎక్కబోతున్నారని స్పష్టంగా తెలిసిపోయింది. ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక మంత్రి నారా లోకేశ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Next Story