- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సుప్రీం ఆదేశాలు వారికి చెంపపెట్టు’.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యలు కేసులో కొమ్మినేనికి జస్టిస్ పీకే విశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం పై ఏపీ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు అంటూ మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి సీఎం చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు.
అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారని వైఎస్ జగన్ ఆరోపించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.
సీఎం చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైసీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థం అవుతుందని వైఎస్ జగన్ అన్నారు. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ(శుక్రవారం) సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ సీఎం చంద్రబాబు కుట్రను ఎండగట్టింది అంటూ మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.






