- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర ఉత్కంఠ.. ఇబ్రహీంపట్నానికి వైఎస్ జగన్.. డేట్ ఫిక్స్!
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి (బుధవారం) ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి (బుధవారం) ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంపై దాడితో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జోగి రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కలిసి జగన్ పరామర్శించనున్నారు.
తీవ్ర ఉత్కంఠ..
జగన్ రాక దృష్ట్యా ఇబ్రహీంపట్నం పరిసరాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న (ఆదివారం) జోగి రమేష్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు తదితరులను పోలీసులు జూపూడి వద్ద అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న వైసీపీ శ్రేణులు, తమ నేతకు మద్దతుగా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. జగన్ పర్యటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ శ్రేణులు ఇబ్రహీంపట్నం వైపు తరలి వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం.






