సింగయ్య మృతి కేసు...జగన్ కీలక నిర్ణయం

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సింగయ్య ( Singaiah) మృతి కేసు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి

సింగయ్య మృతి కేసు...జగన్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సింగయ్య ( Singaiah) మృతి కేసు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ( Ys Jagan Mohan Reddy) సత్తెనపల్లి ( Satthenapally) పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ ( Convoy) కింద పడి... సింగయ్య మరణించినట్లు వీడియో వైరల్ అయింది. ఈ తరుణంలోనే.. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్, అలాగే ఆయన, ఇతర వైసీపీ నేతలపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇలాంటి నేపథ్యంలో... జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

సింగయ్య మృతి కేసులో క్వాష్ పిటిషన్ (Quash Petition ) దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రులు పేర్ని నాని , విడదల రజిని క్వాష్ పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టుకు...ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు క్వాష్... పిటిషన్ దాఖలు చేయనున్నారు వైవి సుబ్బారెడ్డి. ఇక ఈ అన్ని పిటిషన్లను... రేపు ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇది ఇలా ఉండగా సింగయ్య మృతి కేసులో... A2 గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అటు ఇప్పటికే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ అరెస్టు అయ్యాడు. ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా సీజ్ చేశారు పోలీసులు.

Next Story