YS Jagan:తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన మాజీ సీఎం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-02 09:43:41  IST  )

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీలోని మంత్రులు స్పందిస్తూ తెలంగాణ(Telangana) ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

YS Jagan:తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన మాజీ సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీలోని మంత్రులు స్పందిస్తూ తెలంగాణ(Telangana) ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ(జూన్ 2) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘‘తెలంగాణలోని నా సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్(YS Jagan) ట్వీట్టర్(Twitter) వేదికగా పేర్కొన్నారు.

Next Story