- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan:కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన మాజీ సీఎం.. కారణం ఏంటంటే?
పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించింది. ఇదిలా ఉండగా.. దేశ రక్షణ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండా గ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో వీర జవాన్ తల్లిదండ్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పలువురు మంత్రులు పరామర్శించారు. ఈ విషాద ఘటన పై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు, 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా స్పందించారు. ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్ మురళీ నాయక్ స్వగ్రామానికి వెళ్లారు.
ఈ క్రమంలో వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి మాజీ సీఎం జగన్ పరామర్శ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలుగు జవాన్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ఆయన థాంక్స్ చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇచ్చే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. దాన్ని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ తరుణంలో వైసీపీ తరఫున రూ.25 లక్షలు ప్రకటించారు. జవాన్ తల్లిదండ్రులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.






