YS Jagan:‘రప్పా రప్పా నరుకుతాం’.. డైలాగ్ పై ఘాటుగా స్పందించిన మాజీ సీఎం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-19 08:57:57  IST  )

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళలో పర్యటించిన విషయం తెలిసిందే

YS Jagan:‘రప్పా రప్పా నరుకుతాం’.. డైలాగ్ పై ఘాటుగా స్పందించిన మాజీ సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2029 లో తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కడిని గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతామంటూ రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తుళ్లూరుకు చెందిన రవితేజ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు కేసు నమోదు చేయడం పై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో నిన్న(బుధవారం) పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో ‘రప్పా రప్పా నరుకుతాం’ అనే పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని అరెస్టు చేయడం పై వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ‘పుష్పా’ సినిమాలో డైలాగులు పెట్టినా తప్పేనా? అని ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని నిలదీశారు. ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తికి టీడీపీ సభ్యత్వం ఉందని వెల్లడించారు. కానీ.. సీఎం చంద్రబాబు పై కోపంతోనే అతడు మా అభిమానిగా టీడీపీనే రప్పా.. రప్పా కోసేస్తానని పోస్టర్ పట్టుకున్నాడు అని మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఆరోపించారు.

Next Story