- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనకు బ్రేక్.. కారణం ఇదే!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM YS Jagan) ఈ రోజు(బుధవారం) గుంటూరు(Guntur)లో పర్యటించనున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM YS Jagan) ఈ రోజు(బుధవారం) గుంటూరు(Guntur)లో పర్యటించనున్నారు. గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్నారని మొదట వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం సోషల్ మీడియా(Social Media)లో వైసీపీ వర్గీయులు ప్రచారం చేశారు. అక్కడికి వెళ్లి రైతులను పరామర్శించి రైతన్నలకు గిట్టుబాటు ధరపై ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు వెల్లడించారు.
మిర్చికి రేటు లేక అవస్థలు పడుతున్న రైతుల(Farmers) గోడు వినడానికి మాజీ సీఎం జగన్ వస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో నేడు గుంటూరు మిర్చి యార్డుకు (Mirchi Yard) వెళ్లేందుకు ఈసీ(Election Commission)ని వైఎస్ జగన్ అనుమతి కోరారు. కానీ.. వైఎస్ జగన్ పర్యటనకు ఈసీ బ్రేకులు వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Election) కోడ్ ఉండటంతో మిర్చి యార్డులోకి మాజీ సీఎం జగన్‌కి అనుమతి లేకుండా ఈసీ నిరాకరించింది.
వారం రోజుల క్రితం మిర్చి యార్డు వద్ద రైతులు ధర్నాకు దిగారు. వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‘ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతుంది. యార్డులో మిర్చి రైతులు దగా పడుతున్నారు. వరి, పత్తికి ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో రూ.9 వేలు పలికిన పత్తి ఇప్పుడు రూ.4వేలకు కూడా కొనేవారు లేరు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసేదాని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతాంగానికి భరోసా ఇచ్ఛామని’ వైసీపీ నేతలు(YCP Leaders) పేర్కొంటున్నారు.






