YS Jagan:‘ఐ మిస్ యూ’ అంటూ మాజీ సీఎం జగన్ సంచలన పోస్ట్.. కారణమిదే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-24 13:32:48  IST  )

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM Jagan) ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు.

YS Jagan:‘ఐ మిస్ యూ’ అంటూ మాజీ సీఎం జగన్ సంచలన పోస్ట్.. కారణమిదే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM Jagan) ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. నేడు(ఫిబ్రవరి 21) మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని మూడో వర్ధంతి సందర్భంగా ప్రేమగా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్ యూ గౌతమ్’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు గౌతమ్ రెడ్డితో కలిసి ఓ కార్యక్రమంలో దిగిన ఫొటోను షేర్ చేశారు.

అయితే.. 2022 సంవత్సరంలో గౌతమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో (2022) గౌతమ్ రెడ్డి ఫిబ్రవరి 21న హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. 49 ఏళ్ల చిన్న వయసులోనే గౌతమ్ మృతి చెందడం అందరినీ కలచివేసింది. ఈ క్రమంలో నేడు ఆయనను మరోసారి గుర్తుచేసుకొని వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు.

Next Story