- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్‌లో 24.20 శాతం తగ్గిందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగ్ నివేదికలే ఈ వివరాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
ఏప్రిల్ వివరాలు వెల్లడించకుండా మేలో జీఎస్టీ ఆదాయంలో రికార్డులంటూ ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచికలు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవ ఆర్థిక స్థితిగతులకు పొంతన లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వం 2025 ఏప్రిల్‌లో రాష్ట్రానికి నికర జీఎస్టీ వసూళ్లు రూ.3,354 కోట్లుగా నమోదయ్యాయని, జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధికమని గొప్పలు చెప్పుకుంది.
కానీ.. సాంకేతికతో చూస్తే అన్ని సర్దుబాట్ల తర్వాత వచ్చేదే నికర జీఎస్టీ. కాగ్ విడుదల చేసిన 2025 ఏప్రిల్ గణాంకాలు అసలు నిజాన్ని తేటతెల్లం చేశాయని జగన్ తెలిపారు. మే నెలలో కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో 2025 ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి ముందస్తు కేటాయింపుల సర్దుబాటు కింద రూ. 796 కోట్లు మినహాయించుకుందని, అందుకే జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని పేర్కొంది. కానీ నిజానికి జీఎస్టీ ముందస్తు కేటాయింపు అనేది ప్రభుత్వ ఖాతాల్లోని మేజర్ హెడ్ 0006 కింద మైనర్ హెడ్ 110 పరిధిలోకి వస్తుంది. అన్ని సర్దుబాట్లను లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీ ఆదాయాలు నిర్ధారిస్తారు.
గత సంవత్సరాల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. మే 1వ తేదీ ప్రకటనలో 2025 ఏప్రిల్ నికర జీఎస్టీ వసూళ్లు రూ. 3,354 కోట్లు అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు రూ. 796 కోట్లు సర్దుబాటు అయ్యాయని చెప్పడం నిజాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని స్పష్టంగా అర్థమవుతుంది అని మాజీ సీఎం జగన్ వెల్లడించారు. 2024 ఏప్రిల్ తో పోలిస్తే పన్ను ఆదాయాలు 12.21%, పన్నేతర ఆదాయాలు 22.01% మేర తగ్గుదల నమోదు చేశాయి. రాష్ట్ర సొంత ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే, గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల 12.76%గా ఉందని సూచించాయని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.






